Header Banner

ఉప ప్రధానిగా ఆయన ప్రమాణ స్వీకారం! త్వరలో ప్రధాని మోదీ ప్రకటన!

  Thu Apr 10, 2025 18:09        India

బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపాయి. బిహార్ ముఖ్యమంత్రి మరియు జేడీయూ అధినేత నీతీశ్ కుమార్‌ ఉప ప్రధానిగా మారాలని తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించారు. ఒక సమావేశంలో మాట్లాడుతూ, ఎన్డీయే (NDA) కూటమికి నీతీశ్ చేసిన సేవలు వెలకట్టలేనివని, ఆ సేవలను గౌరవిస్తూ ఉప ప్రధాని పదవిని ఇవ్వాలని కోరారు. ఇది జరిగితే, బిహార్ నుంచి బాబూ జగ్జీవన్ రామ్‌ తరువాత ఉప ప్రధానిగా నీతీశ్ చరిత్రలోకి ఎంటరవుతారని చెప్పారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ, రాజకీయ చర్చకు కేంద్ర బిందువుగా మారాయి.

 

భారతదేశంలో "ఉప ప్రధాని" అనే పదవి రాజ్యాంగబద్ధమైన పదవి కాదు. అయినప్పటికీ, కొన్ని రాజకీయ సందర్భాల్లో ఈ పదవికి ప్రాధాన్యత లభించింది. 2004 మే 23 నుండి ఈ పదవి ఖాళీగానే ఉంది. చివరిగా లాల్ కృష్ణ అద్వానీ ఈ పదవిని నిర్వహించారు. ఇప్పటివరకు సర్దార్ వల్లభాయ్ పటేల్, మొరార్జీ దేశాయ్, చౌదరి చరణ్ సింగ్, జగ్జీవన్ రామ్, యశ్వంతరావు చవాన్, దేవి లాల్, లాల్ కృష్ణ అద్వానీ లాంటి ప్రముఖులు ఉప ప్రధాని పదవిలో పనిచేశారు. తాజా వ్యాఖ్యల నేపథ్యంలో, రాజకీయంగా నీతీశ్ కుమార్‌కు ఉన్న ప్రాధాన్యతపై చర్చలు మళ్లీ మొదలయ్యాయి.

 

ఇది కూడా చదవండి: మాజీ సీఎం కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలు! చేబ్రోలు కిరణ్ అరెస్ట్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?

 

జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!

 

రెండు తెలుగు రాష్ట్రాల‌కు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్న‌ల్‌!

 

ఏపీ ప్రజలకు మరో శుభవార్త.. అమరావతిలో ఇ-13, ఇ-15 కీలక రహదారుల విస్తరణ! అక్కడో ఫ్లైఓవర్ - ఆ ప్రాంతం వారికి పండగే!

 

వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #NitishKumar #DeputyPM #AshwiniChoubey #BJPNews #JDU #IndianPolitics #BiharPolitics #NDAGovernment